30 May, 2026 | 2:25 AM

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ

30-05-2026 01:04 AM

బెజ్జంకి, మే 29: సిద్ధిపేట జిల్లా  బెజ్జంకి మండల కేంద్రంలోని ఏకశిలపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణలో మహిళలు, యువకులు, వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో స్వామి నామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు తాగునీరు, ప్రసాదాల ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ఘనంగా కొనసాగింది.