22 August, 2026 | 11:43 PM

Breaking News

పోచమ్మ దేవాలయంలో గణపతి హోమం

22-08-2026 11:04 PM

నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియాలోని పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్స వేడుకల్లో బాగంగా శనివారం గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు, కార్పొరేటర్ బండారి సుధాకర్, ఆలయ కమిటి ఆధ్యక్షుడు అర్కాల శ్రీనివాస్ ల ఆద్వర్యంలో గణపతి హోమం, ఆమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు జరిగాయి.

వేద పండితులు బుడి అరుణ్ శర్మ, బుడి అణుదీప్ శర్మ, సుబ్బ అభేషేక్ శర్మ, వేదాంతు సచిన్ శర్మ, గణేష్ శర్మలు ఆలయంలో పోచమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవాల్లో బాగంగా శాంతి పాఠం, గణపతి పూజ, స్వస్తీ పుణ్యహావచనం, యాగశాల ప్రవేశం, నవగ్రహ పూజలు, జలాదివాసం, గణపతి హోమం నిర్వహించారు. 23న ఆదివారం ఉదయం 9 గంటలకు మహిళలచే సామూహకి కుంకుమార్చనలు, గణపతి పూజా, గర్తవాసం, బీజ న్యాసం, మండపార్చణ, మూల మంత్రం కన్యా లగ్నమున శ్రీ పోచమ్మ తల్లి విగ్రహం పుణ ప్రతిష్టాపణ నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించవచ్చన్నారు. మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.