22 August, 2026 | 11:59 PM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపునకు సర్వే

22-08-2026 11:09 PM

బేల,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం గ్రామంలోని గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలపై సమగ్ర సర్వే నిర్వహించారు. శనివారం స్పెషల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విష్ణు రాథోడ్ సర్వే చేపట్టారు. గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్, సామ నర్సారెడ్డి, వార్డ్ మెంబర్ వినోద్, మంచికంటి ఉషన్న, మంచికంటి సాయి, గెడం సతీష్, నల్ల వెంకట్ రెడ్డి, ప్రకాష్ నవగరే, రవీందర్ పటేల్, దేవన్న, సుధాకర్, సురేష్ రెడ్డి, సునీల్, రణధీర్, దేవన్న, తదితరులు పాల్గొన్నారు.