పిఆర్సి ప్రకటించి, డిఎలను వెంటనే విడుదల చేయాలి
తపస్ రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య
కొడిమ్యాల,(విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా మల్యాల మండల శాఖ ఆధ్వర్యంలో మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల మ్యాడంపల్లి పాఠశాలల ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తలపెట్టిన సభ్యత్వ నమోదులో ఉపాద్యాయులు పాల్గొని సభ్యత్వ నమోదు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య మాట్లాడుతూ... పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండిoగ్ లో ఉన్న 6 డిఎ లను తొందరగా విడుదల చేయాలని,పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని,
ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి,పాత పెన్షన్ పథకం అమలు చేయాలని,మోడల్ స్కూల్, కేజీబీవి సమస్యలు పరిష్కరించాలని గురుకుల పాఠశాలకు కేర్ టేకర్లను నియమించి 010 కింద వేతనాలు చెల్లించాలి, టెట్ పరీక్షలు రద్దు చేయాలని, ఒకవేళ నిర్వహిస్తే అందరికీ క్వాలిఫై మార్కులు సమానంగా ఉండాలని, 317 జీవో సమస్యలకు సీఎం పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వంను కోరారు.ఈ కార్యక్రమంలో తపస్ జగిత్యాల అర్బన్ మండలాధ్యక్షులు కట్ట రామకృష్ణ,మల్యాల మండల అధ్యక్షులు ఎం. హరికృష్ణ ప్రసాద్,ప్రధాన కార్యదర్శి ఏ.వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.






