7 July, 2026 | 4:01 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్   •   భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •  

డ్రోన్ తో బాల గణపతి నిమజ్జనం

18-09-2024 05:37 PM

కడియపు లంకడ్రోన్ తో బాల గణపతి  నిమజ్జనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా కడియపు లంక గ్రామంలో పలువురు చిన్నారులు బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు చేశారు. అనంతరం కడియపు లంకలో స్నానాల రేవుకు నిమజ్జనం కోసం బాల గణనాథున్నితీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కడియపు లంకలో స్నానాల రేవుకు చిన్నారులను భద్రత కారణాల రిత్యా అనుమతించేది లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. దీంతో చిన్నబోకుండా ఆ పసి వాళ్లు తమ మెదడుకు పదను పెట్టి వినూత్నంగా డ్రోన్ తో బాల గణపతి  నిమజ్జనం చెయ్యాలని నిర్ణయించారు. ఈ మేరకు డ్రోన్ నిపుణుడి సహాయంతో నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. గణేషుడి విసర్జన కార్యక్రమంలో చిన్నారులు కేరింతలు కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు.