30 June, 2026 | 8:52 PM

Breaking News

జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •  

కామారెడ్డిలో గంజాయి పట్టివేత

30-06-2026 08:02 PM

నాగవల్లి ఎక్స్ప్రెస్ రైల్లో తరలిస్తున్న గంజాయి 

కామారెడ్డి రైల్వే స్టేషన్లో పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు పక్కా సమాచారం మేరకు నాగవల్లి ఎక్స్ప్రెస్ లో తరలిస్తున్న గంజాయిని మంగళవారం పట్టుకున్నారు. సంబల్పూర్ నుంచి పూణే వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నారు అన్న సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. రూ.5.80 లక్షల విలువైన గంజాయి10.9 కిలో లు రైల్లో ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు నిజా మాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లి కి చెందిన అశోక్ కుమార్ మిశ్రా, మహారాష్ట్రకు చెందిన గణేష్ పండితుగా గుర్తించారు. ఒడిశా రాష్ట్రం రాయిగడ్ నుంచి నాందేడ్ కు అక్రమంగా గంజాయి నీ తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరినీ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ తనికెల్లో కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, ట్రైన్ ఎక్సైజ్ సూపర్డెంట్ అరుణ్ చంద్ర, ఆర్ పి ఎఫ్ ఎస్సై శ్రీనివాసరావు, ఆర్ పి ఎఫ్ పోలీస్ సిబ్బంది ఫరీద్, మహమ్మద్ మున్వర్ గోరి, రాజు నర్సింలు పవన్ తదితరులు పాల్గొన్నారు.