30 June, 2026 | 8:51 PM

Breaking News

సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •  

జమలాపురం శ్రీవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు

30-06-2026 08:05 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి దేవాలయంలో జీర్ణోదరణ, ధ్వజ ప్రతిష్ట సహిత మహా కుంభాభిషేకం కార్యక్రమములో భాగంగా మంగళవారం నాడు ఉదయం 07-00 ని"లకు చతుర్వేద పారాయణ, స్థానములు నవగ్రహ హోమములు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి, అలివేలు మంగమ్మ అమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకము నీరాజన మంత్ర పుష్పముల కార్యక్రమము నిర్వహించటం జరిగినది. సాయంత్రం 04-00 మన్యసూక్త హోమం, మూల మంత్ర హోమము నిర్వహించారు.  స్వామివారిని దర్శించుకున్న భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.