17 March, 2026 | 5:00 AM

గ్యాస్ సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయి

17-03-2026 01:23 AM

జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్

మహబూబ్ నగర్ టౌన్, మార్చి 16 : జిల్లాలో పౌర సరఫరాల శాఖ డి.టి.లు,అధికారులు,పోలీస్ శాఖ ఎస్‌ఐ, సిఐ లతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన టీమ్ లు సోమవారం బాలా నగర్, నవాబ్ పేట మండలాల్లో రెస్టారెంట్ లు, హోటల్ లు వాణిజ్య సంస్థలలో తనిఖీ లు చేశారు. ఈ తనిఖీల్లో బాగంగా డొమెస్టిక్ సిలిండర్ లను వాణిజ్య పరంగా వినియోగిస్తున్న వా ణిజ్య సంస్థలపై 22 కేసులు నమోదు చేసి 29 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్ తెలిపారు.

హన్వాడ, గండీడ్, ముహమ్మదా బాద్ మండలాల్లో కూడా పౌర సరఫరాల శాఖ, పోలీస్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి 18 కేసులు నమోదు చేసి అక్రమంగా వినియోగిస్తున్న 24 సిలిండర్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గృహ అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లు కొరత లేదని, సోషల్ మీడియా వాట్సప్ లో ప్రచారం చేస్తున్న వదంతులు నమ్మ వద్దని, గ్యాస్ డీలర్ ల దగ్గర ఆన్ లైన్, వాట్స్ అప్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపారు. ఈ తనిఖీ లలో రాజీవ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.