15 July, 2026 | 8:24 AM

మందకొడిగా తునికాకు సేకరణ

08-06-2024 02:19 AM

భద్రాద్రి జిల్లాలో 40.08 శాతం మాత్రమే లక్ష్యం పూర్తి

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 7 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలో తునికాకు సేకరణ మందకొడిగా సాగుతున్నది. ఇప్పటికే దాదాపు లక్ష్యం పూర్తి కావాల్సి ఉండగా 40.08శాతం మాత్రమే పూర్తయింది. ఏటా ఆదివాసీలు మే తొలి వారం నుంచి జూన్ చివరి వారంలోపు ఆకు సేకరణ పూర్తి చేస్తారు. ఈ నెల రోజులు ఏజెన్సీ అంతటా సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఏజెన్సీ చిన్నబోయి కనిపిస్తోంది. జిల్లాలోని కిన్నెరసాని వన్యప్రాణి విభాగం, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం ఫారెస్టు డివిజన్లలోని 163 కల్లాల్లో ఆదివాసీలు 32,300 స్టాండర్డ బ్యాగుల (ఎస్బీ) ఆకు సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 12,946.9 ఎస్బీల ఆకు మాత్రమే సేకరించారు.

డివిజన్ల వారీగా..

ఇల్లెందు డివిజన్ నుంచి 10,600 ఎస్బీ లు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 4, 647.419 ఎస్బీలు, కొత్తగూడెం డివిజన్ నుంచి 1,400 ఎస్బీలకు 346.66 ఎస్బీలు, కిన్నెరసాని వన్యప్రాణివి భాగం నుంచి 3,200 ఎస్బీలకు 1,424.678 ఎస్బీలు, పాల్వంచ డవిజన్ నుంచి 2 వేల ఎస్బీలకు 426.884 ఎస్బీలు, మణుగూరు డివిజన్ నుంచి 5,400 ఎస్బీలకు 2,459.669 ఎస్బీ లు, భద్రాచలం డివిజన్  నుంచి 9,700ఎస్బీలకు 3,641.59 ఎస్బీల ఆక సేకరణ పూర్తయింది. వచ్చే వారంలోపు లక్ష్యం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.