ఖేడ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా
విజయోత్సవ ర్యాలీలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్
నారాయణఖేడ్, జూన్ 7 (విజయక్రాంతి): నారాయణఖేడ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. శుక్రవారం ఖేడ్‌లో కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా, ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ రెడ్డితో కలిసి సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ.. జహీరాబాద్‌లో దేవుడి పేరుతో రాజకీయం చేద్దామనుకున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
రాముడు అం దరికీ దేవుడన్నారు. బీబీ పాటిల్ కేవలం బిజినెస్ పాటిల్ అని.. ఆయన పదేళ్లుగా బీఆర్‌ఎస్‌లో ఉండి ఖేడ్‌కు చేసింది ఏమీ లేదని విమర్శించారు. అవకాశ వాదంతో బీజేపీలో చేరిన ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అందరిని కలుపుకొని పోయేతత్వం తమ పార్టీదన్నారు. తనను గెలిపించిన ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు.
ఖేడ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మె ల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఖేడ్‌లో ఎ లాంటి వర్గాలు లేకుండా కలిసి పనిచేస్తామని తెలిపారు. ర్యాలీలో ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేశ్ షెట్కార్, జిత్తు షెట్కార్, కాంగ్రెస్ స్పోక్ పర్సన్ గిరిజా షెట్కార్, రాకేశ్ షెట్కార్, కర్ణె శ్రీనివాస్, సాగర్ షెట్కార్, రషీద్, తాహెర్ పాల్గొన్నారు.






