ఓటు హక్కు వినియోగించుకున్న గౌతమ్ గంభీర్
25-05-2024 11:06 AM
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో ఢిల్లీలోని ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు శనివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు. రేపే ఐపీఎల్ ఫైనల్ ఉన్న విషయం తెలిసిందే. అయిన గంభీర్ చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లి తన ఓటు హక్కువినియోగించుకుని తిరిగి ఇవాళ చెన్నైకి చేరుకోనున్నాడు. ఢిల్లీలో మొత్తం 1.52 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 82 లక్షల మంది పురుషులు, 69 లక్షల మంది మహిళలు, 1,228 థర్డ్ జెండర్ కేటగిరీకి చెందిన వారున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఏడు నియోజకవర్గాల్లో ఈసారి 2.52 లక్షల మందికి పైగా మొదటి సారి ఓటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.






