కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు,2 యూటీల్లోని 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆరో విడతలో 58 మంది ఎంపీ స్థానాల్లో 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆరో విడతలో 11.13 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో 14, పశ్చిమ బెంగాల్ లో 8, హరియాణాలో 10, ఢిల్లీలో 7, బిహార్ 8, ఒడిశాలో 6, జార్ఖండ్ లో 4, జమ్ముకశ్మీర్ లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఒడిశాలో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పవరకు 5 విడతల్లో 428 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తి అయింది. జూన 1 న ఏడో విడతలో 8 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న లోక్ సభ, ఎపి, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.






