6 July, 2026 | 9:11 PM

Breaking News

ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •  

అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ

06-07-2026 08:34 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని జమేదారు బంజర పరిసర అటవీ ప్రాంతంలో  ఈ నెల 1 వ తేదీన  మృతి చెందిన అనాద మహిళ మృతదేహానికి  సోమవారం  గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ ఆద్వర్యంలో అంత్యక్రియలు జరిపారు. దమ్మపేట పోలీసులు అనాద మృతదేహాన్ని గత మూడు రోజుల క్రితం అశ్వారావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. 

మృతదేహానికి సంబందించిన బంధువులు ఎవరూ రాకపోవడంతో అనాదగా గుర్తించిన పోలీసులు మందలపల్లికి చెందిన గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ సహాయాన్ని కోరారు. కాగా మందలపల్లి పంచాయతీ కార్యదర్శి, పోలీసుల సమక్షంలో గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ నిర్వాహకులు అనాద మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. కార్యక్రమంలో  సంస్ధ వ్యవస్ధాపకులు పాలడుగుల అబ్బులు, ఎస్ కె అజీమ్, రొయ్యల కుమార్, జెసిబి సోము తదితరులు పాల్గొన్నారు.