27 August, 2026 | 6:42 AM

సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్

06-07-2026 08:43 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలంలోని రెడ్డిపల్లి పీఏసీఎస్‌లో నరేష్‌ను  సీఈఓగా నియమించవద్దంటూ వైస్ చైర్మన్ గోలి ఆంజనేయులు , డైరెక్టర్లు కొండి మల్లేశం, హరిశంకర్, మెదక్ కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో  ఫిర్యాదు చేశారు. గతంలో  నరేష్ రెడ్డిపల్లి పిఏసిఎస్ లో సీఈఓగా ఉన్నప్పుడు, అవకతవకలు పాల్పడ్డాడని,రైతులకు అన్యాయం చేశాడని, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలులో అవకతవకలు పాలు పడ్డారని  ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార శాఖ అధికారులను కోరారు.