రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం
ముకరంపుర,(విజయక్రాంతి): "వన్ హెల్త్" కార్యక్రమంలో పశువులకు, పెట్ పోషకుల కుక్కలు, పిల్లులకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు, అవసరమైన టీకాలను వేయించాలని నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని... కరీంనగర్ లో సోమవారం జంతు సంక్రమిక వ్యాదుల నివారణ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని జిల్లా పశువైద్య శాలలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ లింగారెడ్డి, డాక్టర్ నరేష్ తో కలిసి " ఉచిత రేబిస్ " టీకాల శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పలు కుక్కలకు టీకాలు, వ్యాక్సిన్ లు వేశారు.
ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కరీంనగర్ నగర పాలక సంస్థ జంతు సంక్రమిక వ్యాదులు రాకుండ... నగరంలో స్వైర విహారం చేస్తున్న కుక్కలను పట్టుకోని బర్థ్ కంట్రోల్ ఆపరేషన్లు చేసి వాటికి రేబిస్ టీకాలు వేస్తుందని తెలిపారు. అలాగే కుక్కలు, పిల్లుల పెంపకం దారులు మీ ఇంటి కుక్కలకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండ రేబిస్ తో పాటు ఇతర వ్యాక్సిన్ లు వేయించాలని తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సంధర్బంగా 85 జంతువులకు ఉచిత టీకాలు, వ్యాక్సిన్లు వెటర్నరీ అధికారులు వేసినట్లు తెలిపారు.






