01-12-2025 05:47:57 PM
చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండిలోని గీర్వాణి విద్యాలయంలో సోమవారం భగవద్గీత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన కృష్ణార్జునుల గీతోపదేశ సన్నివేశం అలరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సొప్పరి ప్రతాప్, వైస్ ప్రిన్సిపాల్, పాఠశాల కోఆర్డినేటర్స్ కోడూరి నాగరాజు, సిరిపురం శ్రీనివాస్, యోగ మాస్టర్ సత్తినేని శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.