01-12-2025 05:54:26 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దూడం రఘురాం, సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లెకు చెందిన కొమ్మిడి దేవేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మృతదేహాలను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఆప్తులను కోల్పోయి తీరని శోకంలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తాను కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఎప్పటికప్పుడు వైద్యులతో ప్రత్యేకంగ మాట్లాడని అన్నారు. మృతదేహాలకు సంబంధించి పోస్టుమార్టం త్వరగా జరిగేలా పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికాలతోనూ ప్రత్యేకంగా రాజేందర్రావు మాట్లాడారు. సత్వరమే పోస్టుమార్టం జరిగేలా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.