calender_icon.png 23 February, 2026 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రభుత్వ పథకాలు పొందండి

23-02-2026 03:46:51 PM

- గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్ 

గజ్వేల్: ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రాయితీలు పొందడానికి ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలని గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్ అన్నారు. సోమవారం గజ్వేల్ మండల పరిధిలోని అహ్మదీపూర్, పిడిచేడ్  క్లస్టర్లలోని గ్రామాలలో ఏవో నాగరాజు ఏఈఓ లతో కలిసి రైతులకు, సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ బాబు నాయక్ మాట్లాడుతూ  వ్యవసాయం చేసే ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.

గజ్వేల్ డివిజన్ పరిధిలో 56,399 రైతులు ఉన్నారని, ఇంకా 26,372 మంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నారు. ఆయా గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు, ఆయా మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి లేదా, మీసేవ కేంద్రాలలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం లబ్ధి పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులకు భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందడంలో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఏ ఈ ఓ లు గణేష్, అంజలి, రైతులు పాల్గొన్నారు.