30 July, 2026 | 11:39 AM

వేములవాడలో వరుణ యాగం

30-07-2026 11:08 AM

వేములవాడ, జులై30(విజయక్రాంతి): రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ లోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులు వరుణ యాగం నిర్వహించారు. జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ కు చేరుకున్న మంత్రులు జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు.