15 April, 2026 | 12:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఫ్రాంచైజీ పేరుతో ఘరానా మోసం

03-02-2026 12:52 AM

15 మంది బాధితుల నుంచి రూ.40 లక్షలకు పైగా వసూల్

చీజ్ లాజిస్టిక్స్ ఫ్రాంచైజీ మోసగాడి అరెస్ట్

ఆదిలాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఫ్రాంచైజీలు ఇప్పిస్తానంటూ పదుల సంఖ్యలో బాధితులని మోసం చేసిన ఘరానా మోసాగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడు. సోమవారం ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.... చీజ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిడేట్ కంపెనీ పేరుతో ఫ్రాం చైజీ ఇస్తానని నమ్మించి పలువురిని మోసం చేసిన హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన నిం దితుడు చిత్తూరి శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆదిలాబాద్‌లోని సంజయ్‌నగర్‌కు చెందిన బాధితుడు గాజుల అనిల్ ఫ్రాంచైజీ పేరుతో తాను మోసపోయానని టూ టౌన్ లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసుకుని విచారించమన్నారు. ఫ్రాంచైజీ పేరుతో నమ్మించి చీజ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిడేట్ కంపెనీలో సభ్యత్వం ఇప్పిస్తానని చెప్పి ముం దుగా డబ్బులు తీసుకుని, సరుకులు సరఫరా చేయకుండా, మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు విచారణలో ఫ్రాంచై జీ అగ్రిమెంట్లు చేసుకుని ముందస్తుగా డబ్బులు తీసుకుని స్వంత అవసరాలకు వాడుకున్నట్లు ఒప్పుకున్నాడన్నారు.

మోసానికి ఉప యోగించిన ఐ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నమన్నారు. ఇలా ఫ్రాంచైజీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 14 మంది నుండి ఒక్కొకరి నుండి రూ. 19 లక్షల నుండి రూ. 2 లక్షల వర కు మొత్తం రూ. 40 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశారన్నారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్ట్‌లో హాజరు పరచడం జరుగుతుందన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోం దని, ఫ్రాంచైజీలాజిస్టిక్స్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ఈ సమావేశంలో ఎస్సై విష్ణు ప్రకాష్, సిబ్బం ది కోటేశ్వరరావు, నరేందర్ పాల్గొన్నారు.