15 April, 2026 | 1:53 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

టీఆర్పీలో భారీగా చేరికలు

03-02-2026 12:48 AM

ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండ లానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాల యంలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారిలో బరిగే ప్రభాకర్, మార్కుక్ యాదగిరి, నార్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.

ఈ కార్య క్రమంలో టీఆర్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తుపతి భిక్షపతి, జగదేవపూర్ మండలం అధ్యక్షులు గడ్డం సురేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం వెంకటేష్, వరుకొల్లా కొండా స్వామి ఆధ్వర్యంలో జరిగింది.

అలా గే ఘట్‌కేసర్ ఆటో యూనియన్ నాయకులు గంగాధర్ ఆధ్వర్యంలో పలువురు ఆటో యూనియన్ నాయకులు తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరారు. ఆటో కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చూపగల నాయకుడు తీన్మార్ మల్ల న్న మాత్రమేనని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా తీన్మార్ మల్ల న్న మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల హక్కుల కోసం శాసనమండలిలో మాట్లాడినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో స్టీఫెన్, కుమా ర్, నరేష్, జానీ, సుధీర్, నిజాం, బాబు, మజ్జు, సయ్యద్, సలాం, బాన్, వరుణ్, భాస్కర్, గుణ, సాయి, ప్రవీణ్, సర్వర్, అనువ్యాప్, దుర్గా, మధు, స్టీఫెన్, అక్రమ్, షాబు ద్దీన్, రజిని ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్పీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు చక్రపాణి గౌడ్ పాల్గొన్నారు.

పాలుమూరు నాయకుల నియామకం

మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్పీ పలు విభాగాల కమిటీలకు కొత్తగా అధ్యక్షులను నియమించా రు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మద న్ మోహన్ చారీ ఆధ్యర్యంలో పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న నియామక పత్రాలను అందజేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఆంజనేయు లు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా చందు ముదిరాజ్, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అలీని నియమించారు.