17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

చెట్ల కొమ్మలను తొలగించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

23-06-2025 01:35 AM

ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లో గత కొన్ని రోజులుగా వర్షా కాలం దృష్ట్యా విద్యుత్ తీగలు ఫీడర్ల పై అనుకొని వున్న చెట్ల కొమ్మలను విద్యుత్ సిబ్బంది ఆదివారం  తొలగించారు.

రోడ్లపై చెట్ల కొమ్మల కుప్పలు పేరుకుపోవడంతో  డివిజన్ ప్రజలు గాంధీ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్  జిహెచ్‌ఎంసి కమిషనర్ తో సమస్య పై సమీక్షించి, చెట్ల కొమ్మలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవా లని కోరారు.

కమిషనర్ ఆదేశాల మేరకు  స్పెషల్ డ్రైవ్ క్రింద వెహికల్స్ ఏర్పాటు చేసి చిక్కడపల్లి, అశోక్ నగర్, గాంధీనగర్ వ్యాప్తంగా రోడ్లపై  కుప్పలుగా పేరుకుపోయిన చెట్ల కొమ్మల ను  జిహెచ్‌ఎంసి సిబ్బంది తొలగించారు. కార్పొరేటర్ సూచనల మేరకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమా ర్  పర్యవేక్షించారు. బీజేపీ నేతలు ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్ ఉన్నారు.