calender_icon.png 12 November, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యంపై బాలికలకు, మహిళలకు అవగాహన ఉండాలి

12-11-2025 08:20:17 PM

కిషోర బాలికలకు ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ..

వరంగల్ ఎంపీ కడియం కావ్య..

ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ..

రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): కిషోర బాలికలు మెనుస్ట్రూ అండ్ ఐజనిక్ పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. బుధవారం మైలారం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో గివ్ ఫర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు ఉచిత సానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ రుతుస్రావ సమస్య వల్ల బాలికలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారని తెలిపారు. ఆరోగ్యం విద్యా వికాసంపై వైద్యురాలిగా గతంలో సేవలు అందించినట్లు తెలిపారు.

2016 నుండి బాలికలకు సానిటరీ నాప్ కిన్స్ ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించానని అన్నారు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆరోగ్యంపై బాలికలకు మహిళలకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రుతు స్రావ సమస్యను ఎలా ఎదుర్కొవాలో కిషోర బాలికలు రాబోవు తరాలకు తెలియజేయాలని సూచించారు. అవగాహన చాలా ముఖ్యమని తెలిపారు. మెనూస్ట్రల్  సమస్య ఉందని అనుకోవద్దని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాప్ కిన్స్ అందచేసిన ఫర్ గివ్ సంస్థ సత్యను అభినందించారు. తన నిధుల నుండి 60 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక సంక్షేమ పథకాలకు నిధులు తెస్తున్న భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావును ఈ సందర్భంగా ఆమె అభినందించారు.

భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు క్రీడాకారులుగా,  విద్యావేత్తలుగా ఎదిగి ఈ ప్రాంతానికి, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ పాఠశాలకు అవసరమైన సిసి కెమెరా, క్రీడా మైదానం, ప్రహరి గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ  పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు ఋతుస్రావ  సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే విధంగా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మహిళా సంక్షేమ అధికారిని మల్లేశ్వరి, పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టప్ప, గివ్ ఫర్ సొసైటీ సంస్థ అధ్యక్షులు సత్య, కో ఆర్డినేటర్ శిరీష,తదితరులు పాల్గొన్నారు.