calender_icon.png 12 November, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైన్ స్నాచింగ్ కు పాల్పడిన విద్యార్థి, అరెస్ట్ రిమాండ్

12-11-2025 08:22:49 PM

యువత ఆన్లైన్ గేమ్ లకు బానిస కావద్దు

భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

కామారెడ్డి ఏ ఎస్ పి చైతన్య రెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): మహిళ మెడలో నుంచి గొలుసు చోరీకి పాల్పడిన విద్యార్థినినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ విద్యార్థి వివరాలను వెల్లడించారు. కామారెడ్డి వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్న మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్ చేసిన ఓ విద్యార్థిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. నాందేడ్ జిల్లాకు చెందిన రోహిత్ మారుతి అనే విద్యార్థి వెటర్నరీలో సీట్ పొందాడని, ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి ఇద్దరు వద్ద అప్పులు చేశాడని తెలిపారు.

నాందేడ్ నుంచి రైల్లో కామారెడ్డికి వచ్చి వివేకానంద కాలనీ చెందిన కొండ లలిత ఇంటి వద్దకు వెళ్లి  నీళ్లు అడిగి తాగిన అనంతరం మహిళ మెడలో ఉన్న గొలుసును దొంగిలించారు. స్థానికులు ఎన్ సి సి విద్యార్థులు అనుమానితుని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో సీసీ కెమెరాలు ద్వారా పట్టుకున్నట్లు ఏ ఎస్ పి తెలిపారు. నిందితుని వద్ద నుంచి 13 గ్రాముల బంగారం గొలుసు, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ నరహరిని, ఎస్సై బాల్రెడ్డిని పోలీస్ సిబ్బందిని ఏ ఎస్ పి చైతన్య రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతి,యువకులు ఆన్లైన్ యాప్ లలో బెట్టింగ్ లకు పాల్పడవద్దని మంచి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆమె సూచించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ నరహరి, ఎస్సై బాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.