calender_icon.png 7 May, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

23-04-2025 12:33:42 AM

ప్రథమ సంవత్సరంలో 62.44 శాతం 

ద్వితీయ సంవత్సరంలో 72.43%

రాష్ట్రంలో 9వ స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రధమ ద్వితీయ సంవత్సరపు పరీక్ష ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలికలదే హవా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 62.44శాతం, ద్వితీయ సంవత్సరంలో 72. 43 శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలో 9వ స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచింది. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం 7,215 విద్యార్థుల పరీక్షకు హాజరు కాగా 4,514 మంది ఉత్తీర్ణత సాధించి 62.56 శాతంలో నిలిచారు. ఒకేషనల్ విభాగంలో 2,039 మంది విద్యార్థుల పరీక్ష హాజరు కాగా 1,2 65 మంది ఉత్తీర్ణత సాధించి 62. 04 శాతం ఉత్తెనత పొందారు.

ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 7,079 మంది పరీక్షకు హాజరు కాగా 5,045 మంది ఉత్తీర్ణత సాధించి 71.27% ఉత్తీర్ణత పొందారు. ఒకేషనల్ విభాగంలో 17 87 మంది పరీక్షకు హాజరుకాగా 13 77 మంది ఉత్తీర్ణత సాధించి 77.06% నిలిచారు. మొదటి సంవత్సరములో బాలికలు 70.94% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 50.72 శాతం లో ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 79.73% ఉత్తీర్ణత సాధిస్తే బాలురు 62.51% ఉత్తీర్ణత పొందారు. జిల్లా ఇంటర్మీడియట్ ఫలితాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు కలెక్టర్కు అందజేశారు.