calender_icon.png 29 July, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్‌లో బస్సు-లారీ ఢీ: 18 మంది మృతి

29-07-2025 09:54:39 AM

జార్ఖండ్: జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో కనీసం 18 మంది కన్వారియాలు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్(Mohanpur Police Station) పరిధిలోని జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కన్వారియాలను(Kanwariyas) తీసుకెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం ప్రభావం తీవ్రంగా ఉండటంతో, అనేక మంది గాయపడ్డారు. దుమ్కా జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ శైలేంద్ర కుమార్ సిన్హా ప్రకారం, శ్రావణ కన్వర్ యాత్రలో పాల్గొన్న యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు 32 సీట్లదని. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అత్యవసర బృందాలను వెంటనే అప్రమత్తం చేసి, గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.

జిల్లా యంత్రాంగం రక్షణ, వైద్య ప్రతిస్పందనను పర్యవేక్షిస్తోంది. ఈ విషాదంపై గొడ్డా ఎంపీ నిషికాంత్ దూబే విచారం వ్యక్తం చేస్తూ, "నా లోక్‌సభ నియోజకవర్గం దేవ్‌ఘర్‌లో, పవిత్ర శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర సందర్భంగా, బస్సు, ట్రక్కు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాబా బైద్యనాథ్ వారి కుటుంబాలకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించుగాక" అని ఎక్స్ లో పోస్టులో అన్నారు. శ్రావణ మాసంలో(shravana masam) మూడవ సోమవారీని పురస్కరించుకుని, దేవఘర్‌లోని బాబాధామ్ ఆలయంలో మూడు లక్షలకు పైగా యాత్రికులు గుమిగూడిన రోజున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలన స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.