29-07-2025 08:29:09 AM
టీచర్ వేధింపులపై విద్యార్థులు ఎంఈఓకి కంప్లైంట్.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): తరచూ పాఠశాలకు మద్యం తాగి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఈ తాగుబోతు సార్(Teacher Harassment) మాకొద్దని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బిజినపల్లి మండల మహదేవుని పేట గ్రామ పాఠశాలలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తరచూ మద్యం తాగి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ విద్యార్థినీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో కొంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేమని ఇంట్లో మారం చేస్తుండగా గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి మండల విద్యాధికారి రఘునందన్ రావుకి ఫిర్యాదు చేశారు.