29-07-2025 09:31:27 AM
కంగ్టి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంగ్టి సీఐగా వెంకట్ రెడ్డిని నియమిస్తూ జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిర్గాపూర్ ఎస్సైగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి రెండు నెలల క్రితం సీఐగా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయన కంగ్టి సీఐగా రానున్నారు. ఇక్కడ కొంతకాలంగా పని చేస్తున్న సీఐ చంద్రశేఖర్ రెడ్డి మల్టీ జోన్ -2కు బదిలీ అయ్యారు.