15 July, 2026 | 6:55 AM

వైసీపీపై దాడుల వివరాలు ఇవ్వండి

21-06-2024 01:47 AM

రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం

విజయవాడ, జూన్ 21 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయనే కేసులో పూర్తి వివరాలను నివేదించాలని ఏపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి తాఖీదులు ఇచ్చింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్‌ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. దాడులను పోలీసులు చూస్తూ ఉన్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేసిన పిల్ తరఫున లాయర్ కొవ్వూరి వెంకట్రామిరెడ్డి వాదించారు.