15 July, 2026 | 12:40 AM

నిజమైన ఉద్యమకారులకే ప్రాధాన్యత ఇవ్వండి

15-07-2026 12:40 AM

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఫౌండర్ చీమ శ్రీనివాస్

సికింద్రాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమీక్ష సమావేశాలలో జరుగుతున్న లోపాలపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించాలని, తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఫౌండర్, చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

ఈ సందర్భంగా డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున కృతజ్ఞతలు తెలిపారు. కానీ నేడు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమీక్ష సమావేశాలలో జరుగుతున్న తీరు పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు.