08-12-2025 12:58:43 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 7 ( విజయక్రాంతి): గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఆదివారం మొదటి విడత పోలింగ్ జరిగే’ 6’ మండలాల్లో భాగంగా యాదగిరిగుట్ట మం డల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను గుర్తించి వారికి బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని తిరిగి సదరు ఓటరు తన ఓటు బ్యాలెట్ పేపర్ ను బాక్సులో వేసే వరకు పిఓలు గమనించాలన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాగంగా ఈ నెల 11న మొదటి విడత ’6’ మండలాల్లో జరిగే పోలింగ్ కేంద్రాలకు ముందు రోజు అవసరమైన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారని , డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మెటీరియల్ మొత్తం వచ్చిందా అని అడిగి తెలుసుకున్నారు.ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలో పోలింగ్ కేంద్రాలను (పచ్చని తోరణాలు, తదితర అవసరమైన ఏర్పాట్లు చేసి మోడల్ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కు మధ్యాహ్నం ఒంటి గంట వరకే సమయం ఉంటుందని తదుపరి రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగించాలని అన్నారు.
ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లను గుర్తించడంలో చాలా జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గణేష్ నాయక్, ఎంపీడీవో నవీన్ తదితరులు పాల్గొన్నారు.