గల్లీకో శంకర్‌దాదా ఎంబీబీఎస్
- జిల్లాలో పెద్ద సంఖ్యలో నకిలీ వైద్యులు
- ఆసుపత్రులలో బెడ్లు వేసి వైద్యం అందిస్తున్న వైనం
- అరెస్టు చేసినా మళ్లీ వైద్యం
- ప్రజల ప్రాణాలతో చెలగాటం
మేడ్చల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో నకిలీ వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనీస వైద్య అర్హత లేకున్నప్పటికీ గల్లీలలో ఆసుపత్రులు ఏర్పాటు చేసి వైద్యులుగా చలామణి అవుతున్నారు. జిల్లాలో గతంలో అనేకమంది నకిలీలు పట్టుబడ్డారు. అయినప్పటికీ వారు మళ్లీ వైద్యం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆర్.ఎం.పి, పి ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. ఇంజక్షన్లు కూడా ఇవ్వరాదు. కానీ అర్హతకు మించి చికిత్స చేస్తున్నారు.
ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్, యాంటీబయటిక్స్ ఇచ్చి ప్రాణాల మీదకు తెస్తున్నారు. చిన్నపిల్లలకు, గర్భిణులకు వైద్యం చేయరాదు. కానీ వీరికి కూడా వైద్యం చేస్తున్నారు. మరికొందరు ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను తీసుకొస్తున్నారు. వీరికి వైద్య పట్టా లేకున్నప్పటికీ డాక్టర్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో జిల్లాలో పట్టుబడిన వారిపై నిఘా వేయకపోవడంతో మళ్లీ వైద్యం చేసి ప్రాణాలు తీస్తున్నారు.
గత సంవత్సరం బోడుప్పల్ దేవేందర్ నగర్ లో హాసిని (7) అనే చిన్నారి నకిలీ వైద్యుడు నిర్వాకానికి బలైంది. సిహెచ్ బాల సిద్ధులు అనే వ్యక్తికి ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్ ఏర్పాటు చేసి జ్వరంతో బాధపడుతున్న పాపకు చికిత్స చేశాడు. పాప పరిస్థితి విషమించిన పెద్ద ఆసుపత్రికి పంపలేదు. పాప మరణించడంతో ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి
సీజ్ చేశారు. బాల సిద్ధులు ఇంతకుముందు కూడా పట్టుబడ్డా డు. మేడ్చల్ మండ లం కిష్టాపూర్ లో రాజు అనే వ్యక్తికి ఎలా ంటి అర్హత లేకున్నా చికిత్స చేసి ఒక మహిళ మృతికి కారకుడయ్యాడు. దీంతో ఈయనలను పోలీసు లు అరెస్టు చేశారు. మేడ్చల్ పట్టణంలో ఏ డు గుళ్ల వెనుక పెంటయ్య అనే వ్యక్తి ఎలాంటి అర్హత లేకున్నా ఆసుపత్రి నిర్వహిస్తూ వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. జగద్గిరిగుట్టలో శివనాగుల శ్రీనివాసు నిర్వహిస్తున్న హాసిని క్లినిక్ తనిఖీ చేయగా ఫార్మ్ డి అర్హత ఉన్న ప్రతీక అనే వ్యక్తి జనరల్ ఫిజీషియన్‌గా అవతారం ఎత్తి చికిత్స చేస్తున్నట్లు బయటపడి ంది. ఇలా చాలామంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారిపై ని ఘా లేనందున చాలామంది మళ్లీ వైద్యం చేస్తున్నారు.
అనుమతి లేకుండా ఆస్పత్రుల ఏర్పాటు
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్‌ఎంపి, పిఎంపి లు సైతం బెడ్లు వేసి చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు ఉండడం లేదు. కొన్ని ఆసుపత్రులలో ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద ఆసుపత్రుల తరహాలో ఉంటున్నాయి. పి సి పి ఎన్ డి సర్టిఫికెట్ తీసుకోవడం లేదు. డాక్టర్ల అర్హత తప్పుగా చూపించి రోగులను మోసం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అల్ట్రా సౌండ్ యంత్రాలను వినియోగిస్తున్నారు.
పారామెడికల్ సిబ్బందికి లైసెన్సు ఉండడం లేదు. అందులోనే రక్త పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు చేస్తున్నారు. వీటికి రోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అనధికారికంగా మెడికల్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు.
తనిఖీలు చేయాలి
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల తనిఖీలు నిర్వహించి 12 మంది నకిలీ డాక్టర్లను అరెస్టు చేశారు. అంతేగాక నకిలీ వైద్యులు ఉన్నట్లు తెలిస్తే పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. నకిలీ వైద్యులపై నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల తరహాలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా స్థానిక పోలీసులు తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నకిలీ వైద్యులపై, గతంలో పట్టుబడి మళ్లీ వైద్యం చేస్తున్న వారిపై నిఘవేయాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఆసుపత్రులలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోదాలు చేయాల్సిన అవసరం ఉంది.






