ఆ దోషులను కఠినంగా శిక్షించాలి
పెద్దమ్మ తల్లి విగ్రహాల ధ్వంసంపై ముదిరాజ్ నేతల నిరసన
ఆదిలాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): బీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన ఆందోళనకు దారి తీసింది. పోచమ్మ తల్లి విగ్రహం ధ్వంసం పట్ల ముదిరాజ్ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. అఖిల భార త కోలీ సమాజ్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ బొజ్జ నారాయణ ముదిరాజ్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కొలిపూర్ లో జరిగిన ముదిరాజ్ సంఘ సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు.
హోలీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొ న్న ముదిరాజ్ మహాసభ నేతలు పిప్పల్ కోటి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహాల ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించారు. దోషులు ఎంతటి వారైనా కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తం గా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు బోయులు బొమ్మన లస్మన్న ముదిరా జ్, ఈగల పోచన్న, ఆదినారాయణ, ధార వేణి గంగారెడ్డి ముదిరాజ్ , మామిళ్ళ రాములు, శ్రీపతి దత్తు దయ్యాల సంతోష్, దార్ష పెంటన్న, కొండవేణి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కాగా భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహం ధ్వంసం చేసిన మతిస్థిమితం లేని వ్యక్తి అని జైనథ్ సిఐ శ్రావణ్ తెలిపారు. గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, భీంపూర్ పోలీసులు ఎస్త్స్ర విక్రం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా పిట్ల చిరంజీవి అనే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు గుర్తించామని సీఐ తెలిపారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దన్నారు.




