30 June, 2026 | 8:41 PM

Breaking News

పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •  

జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోచ్ గా గోగర్ల సాయి ఎంపిక

25-06-2025 05:06 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 28 నుంచి జూలై 3వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ పట్టణంలో జరిగే HFI 54వ సీనియర్ మహిళల హ్యండ్ బాల్ పోటీలకు తెలంగాణ మహిళా హ్యాండ్ బాల్ జట్లు కోచ్ గా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ వాసవి పాఠశాలలో పిఈటి గా సేవలు అందిస్తున్న గోగర్ల సాయి ఎంపికైనట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అధ్యక్షుడు గొనె శ్యామ్ సుందర్ రావు(District Handball President Gone Shyam Sundar Rao), ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు.

NIS Certificate Course చేసిన సాయి గతంలో కూడా రాష్ట్ర జట్టుకు, జిల్లా జట్లకు కోచ్ గా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందారు. సాయి రాష్ట్ర జట్టు కోచ్ గా ఎంపికకావడం పట్ల ఆసిఫాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ ఇంచార్జి ప్రెసిడెంట్ అరిగేలా మల్లికార్జున్ యాదవ్, DYSO & DD రమాదేవి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కోశాధికారి రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ బండ మీన రెడ్డి, కోచ్ లు అరవింద్, రాజలింగు, సాయి, సాగర్, తిరుమల, రవి, సీనియర్ క్రీడాకారులు, తదితరులు అభినందించారు.