14 April, 2026 | 5:16 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

కార్మికుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

25-06-2025 05:10 PM

మునగాల: కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను రద్దు చేయడం సరి అయినది కాదని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు(CITU District President Rambabu) అన్నారు. బుధవారం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ రామకృష్ణారెడ్డికి జులై 9న జరుగు సార్వత్రిక సమ్మె నోటీసును ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకువచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు.

ఈ కోడ్ లు గానూక అమల్లు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరమవుతుందని, భవిష్యత్తులో కార్మికులు సమ్మె హక్కుకు సైతం పరిమితిలు ఏర్పడతాయన్నారు. ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారని కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అనంతు మైసయ్య గౌడ్, బి వీరబాబు, బి సైదులు , నరేష్, తదితరులు పాల్గొన్నారు.