29 March, 2026 | 3:38 AM

నెలరోజులుగా ఢీ అంటే ఢీ

29-03-2026 01:52 AM
  1. అమెరికా ఇరాన్ మధ్య భీకరపోరు

గల్ఫ్ ప్రాంతాల్లో ఆగని యుద్ధం

ప్రపంచానికి ఇంధన సంక్షోభం!

హోర్ముజ్‌లో నౌకల ట్రాఫిక్‌జాం

మొదటి విడత దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ హతం

భారీగా సైనిక, ఆస్తి, ప్రాణనష్టం

న్యూఢిల్లీ, మార్చి28: అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఒక నెల అయ్యింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ వైమానిక, క్షిపణులు, డ్రోన్ల దాడుల వల్ల పోరుచేస్తు న్న దేశాలు తమతమ సైనికబలగాలు, ఆయు ధ సామగ్రిని కోలుకోలేని విధంగా కోల్పోతున్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు అధికమయ్యాయి. అంతేకాదు ఇరాన్ హోర్ముజన్ బంద్ పెట్టడం వల్ల ప్రపంచానికి ఇధన కొరత ఏర్పడి సంక్షోభానికి దారితీస్తోంది.

దీంతో భారత్‌తోపాటు ఆయా దేశాలు అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అనేక మంది కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య షరతుల సమరం కొనసాగుతున్నాయి. దీంతో యుద్ధం ఇప్పట్లో ఆగేట్లు కన్పిస్తలేదు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన మొదటి విడత దాడు ల్లో ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అగ్ర నాయకత్వాన్ని తొలగించి, పాశ్చాత్య దేశాలకు మరింత అనుకూలమైన వ్యవస్థకు మార్గం సుగమం చేయడానికి ఇరాన్‌పై స్వల్పకాలిక వైమానిక దాడులు చేస్తామని అమెరికా భావించాయి.

కానీ ఇరాన్ ప్రతిఘటన వారిని గడ్డు పరిస్థితుల్లోకి నెట్టాయి. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా ఖమేనీ, ఇతర ఉన్నత సైనిక, గూఢచార అధికారులు హత్యకు గురైనప్పటికీ, టెహ్రాన్ ఇప్పటికీ ఒత్తిడికి లొంగడం లేదు.  ఫిబ్రవరి 28న, వాషింగ్టన్, టెల్ అవీవ్, టెహ్రాన్, మినాబ్ అనేక ఇతర నగరాలపై వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ దాడులు నిరంతరాయంగా కొనసాగుతూ, 175 మంది పాఠశాల బాలికలతో సహా సుమారు 1,900 మందిని బలిగొన్నాయి. 32 లక్షల మందిని నిరాశ్రయులను చేశాయి.

ఇటీవల ఒక బ్రీఫింగ్‌లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరానికి కీలకమైన భూగర్భ స్థావరాలు, భవనాలతో సహా 10,000కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశామని, 150కి పైగా ఇరాన్ నౌకలను ముంచివేశామని పేర్కొన్నారు. ఫిబ్రవరి28 నుంచి యుద్ధంలో పాల్గొ న్న డజనుకు పైగా దేశాల్లో, ఇరాన్‌లో 1,900 మందితో సహా 4,500 మందికి పైగా మరణించారని ది ఇండిపెండెంట్ మీడియా వెల్ల డించింది. ఇరాన్ మీడియా ప్రకారం, వైమానిక దాడులలో ఇరాన్‌లోని రెండు ప్రధాన ఉక్కు కర్మాగారాలు దెబ్బతిన్నాయి.

పెంటగాన్ మాజీ అధికారిణి ఎలైన్ మెక్కస్కర్ అంచనా ప్రకారం, కేవలం మొదటి మూడు వారాల్లోనే జరిగిన యుద్ధ నష్టం, నష్టాల భర్తీకి అమెరికాకు 1.4 బిలియన్ డాలర్ల నుంచి 2.9 బిలియ న్ డాలర్ల వరకు ఖర్చు కావచ్చు. ప్రపంచ చమురులో దాదాపు 20 శాతాన్ని రవాణా చేసే మార్గమైన హోర్ముజ్ జలసంధిపై తన నియంత్రణ ద్వారా ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడిని తీసుకురాగలిగింది.