సంక్షోభం నుంచి దేశాన్ని రక్షిస్తాం
- యుద్ధ సవాళ్లను ఎదుర్కొంటాం
రైతులపై భారం పడకుండా చర్యలు తీసుకుంటాం
ప్రజలంతా ఐక్యతతో ఉండాలి
రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేయొద్దు
నోయిడా విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ
నోయిడా, మార్చి 28: పశ్చిమాసియా సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతులపై యుద్ధభారం పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సంక్షోభ సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా దేశంలో అభివృద్ధి కొనసాగుతోందన్నారు. యుద్ధం కారణంగా ఎదురవుతోన్న సవాళ్లను భారత్ పూర్తి శక్తితో ఎదుర్కొంటోందని ప్రధా ని వివరించారు.
ఉత్తరప్రదేశ్ జేవార్‌లో పీపీపీ భాగస్వామ్యంతో రూ. 11,200 కోట్లతో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. గత నెలరో జులుగా జరుగుతున్న భీకర పోరు కారణంగా ఆహారం, ఇంధనం, గ్యాస్‌పై తీవ్ర ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తంచేశారు.
అనేక దేశాల్లో నిత్యావసర సరకుల కొరత ఏర్పడిందన్నారు. ప్రతిదేశం ఈ సంక్షోభాన్ని అధిగ మించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సంక్షోభ సమయాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఐక్యతతో ఉండాలని, ప్రశాంతతను పాటించాలని పిలుపుని చ్చారు.
ప్రజలను భయాందోళనకు గురిచేసే తప్పుడు ప్రచారాలు చేయొద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వ విధానాలు దేశం, ప్రజల ప్రయోజనాలకు అనుగు ణంగానే ఉంటాయని స్పష్టంచేశారు.
3,900 మీటర్ల అతిపెద్ద రన్ వే..
అత్యాధునిక సౌకర్యాలతో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేపట్టారు. అధునాతన నావిగేషన్ సిస్టమ్స్ సాయంతో 3,900 మీటర్ల పొడవైన విమానాశ్రయ రన్ వే అతిపెద్ద విమానా రాకపోకలకు వీలు కల్పిస్తుంది. 2.5 లక్షల మెట్రిక్ టన్నుల సరకు రవాణాకు మల్టీమోడల్ కార్గో హబ్ ఉంది. దీని విస్తరణ సామర్థ్యం 18 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. యమునా ఎక్స్ ప్రెస్ వే వెంబడి వ్యూహాత్మకంగా ఈ ఏయిర్ పోర్ట్ ను నిర్మించారు. రోడ్డు, రైలు, మెట్రో, ప్రాంతీయ రవాణా నెట్ వర్క్ ల అనుసంధానంతో బహుళ రవాణా కేంద్రంగా విమానాశ్రయం నిలవనుంది.




