దిగొచ్చిన బంగారం, వెండి
10 గ్రాముల పసిడిపై రూ.4,300, వెండి రూ.10 వేలు తగ్గుదల
దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. 10 గ్రాముల బంగారంపై భారీగా ₹4,300 తగ్గుదల నమోదైంది.
న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.4,300 క్షీణించి, రూ.1.56లక్షలకు(పన్నులన్నీ కలిపి) పతనమైంది. కిలో వెండి సైతం రూ.10వేలు తగ్గి, రూ.2.45లక్షలకు( పన్నులన్నీ కలిపి) చేరింది.
మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం తాజా వార్తలు చూడండి
క్రూడాయిల్ రేట్లు పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడంతో డిమాండ్ తగ్గుముఖం పట్టడం వల్ల ఈ లోహాల ధరలు పడిపోయా యి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు పసిడి ధర రోజు వ్యవధిలో 90 డాలర్లు పతనమై 4,168 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు ధర 2.24 శాతం క్షీణించి, 63.87 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
FAQ's
Q1: బంగారం ధరలు ఎందుకు తగ్గాయి?
👉 అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, డాలర్ బలపడటం వల్ల ధరలు పడిపోయాయి.
Q2: ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
👉 ధరలు తగ్గిన సమయంలో కొనుగోలు చేయడం అనుకూలంగా భావిస్తారు, కానీ మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించడం అవసరం.
Q3: వెండి ధరలు ఎందుకు పడిపోయాయి?
👉 అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గడం వల్ల వెండి ధరలు కూడా తగ్గాయి.
Q4: భవిష్యత్తులో ధరలు పెరుగుతాయా?
👉 మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ ఆధారంగా ధరలు మారే అవకాశం ఉంది.
మార్కెట్ ట్రెండ్స్ కోసం బిజినెస్ వార్తలు కూడా చదవండి






