11 June, 2026 | 2:07 AM

మెడికవర్‌లో అత్యాధునిక సేవలు

11-06-2026 01:15 AM

న్యూరో ఎండోస్కోపీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): న్యూరో సర్జరీ రంగంలో అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్సలను ప్రజలకు అందు బాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్లోని సంగీత్ యూనిట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూరో ఎండోస్కోపీని ఘనంగా ప్రారంభించింది.

ఈ కేంద్రాన్ని ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ డీఆర్డీవో చైర్మన్, మాజీ రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి, మాజీ రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా సేవలందించిన డాక్టర్ జి. సతీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ నూతన కేంద్రం ద్వారా మెదడు కణితులు (బ్రెయిన్ ట్యూమర్స్), స్కల్ బేస్ డిజార్డర్స్, హైడ్రోసెఫాలస్, వెంట్రిక్యులర్ పాథాలజీస్ వంటి క్లిష్ట న్యూరోలాజికల్ సమస్యలకు అత్యాధునిక న్యూరో ఎండోస్కోపిక్ చికిత్సలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి.

ఈ కేంద్రానికి ప్రధాన బలంగా సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ రమేష్ శిగకోళ్లి అనుభవం నిలుస్తుంది. డాక్టర్ రమే ష్ శిగకోళ్లి మాట్లాడుతూ, న్యూరో ఎండోస్కోపీ కారణంగా క్లిష్టమైన మెదడు వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో శస్త్రచికిత్స సమయంలో గాయాలు తగ్గి, నొప్పి తక్కువగా ఉండి, రో గులు త్వరగా కోలుకునే అవకాశం ఉం టుంది. ప్రపంచ స్థాయి న్యూరో ఎండోస్కోపిక్ సేవలను స్థానిక ప్రజలకు అం దుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం అని తెలిపారు.

డాక్టర్ జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇమేజింగ్, నావిగేషన్, ఆప్టిక్స్, ప్రెసిషన్ టెక్నాలజీలలో వచ్చిన పురోగతి వైద్యరంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్తోంది. ఈ ఆధు నిక సాంకేతికతలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో మెడికవర్ హాస్పి టల్స్ చేస్తున్న కృషి అభినందనీయం అ న్నారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ న్యూరో ఫిజిషియన్  డా. వికాస్ అగర్వాల్ (సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్), డా. శ్రీనివాస్ రావు దూసా (సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్), డా. సుధీర్ పెంచాల పుట్టిబోయిన (సీనియ ర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్), డా. రోహిత్ రమేష్ వడిఖాయే (కన్సల్టెంట్ న్యూరోసర్జన్)తో పాటు సెంటర్ హెడ్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.