22 March, 2026 | 6:21 PM

యాదగిరిగుట్ట ఆలయ గోపురానికి బంగారు తాపడం

29-09-2024 12:41 AM

మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వెంటనే ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి ఇచ్చినట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.