calender_icon.png 14 November, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ పెరిగిన పసిడి ధర

14-11-2025 12:00:00 AM

హైదరాబాద్‌లో రూ.1,31,500కు చేరిక

హైదరాబాద్, నవంబర్ 13: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సామాన్యులకు అందనంత దూరంలో పసిడి, వెండి ఉంటున్నాయి. గురువారం హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాము ల బంగారం ధర ఒక్కరోజులో రూ. 3 వేలకు పైగా పెరిగి రూ. 1,31,500కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1.17లక్షల పైన పలుకుతోంది.

కిలో వెండి ధర ఒక్కరోజులో రూ. 10వేలకు పైగా పెరిగి రూ. 1,71,300కు చేరుకుంది. ఇటీవలి కాలంలో దాదాపు స్థిరంగా ఉన్న బంగారం ధరలు, తాజాగా మరోసారి పెరుగుతూ ఉండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4,200 డాలర్లను దాటి 4,218 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ఔన్సు ధర 54.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కాగా అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ముగియడంతో ఆర్థిక కార్యకలాపాలు ఎప్పటిలానే యథావిధిగా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు మార్గం సుగమం కానున్న నేపథ్యంలో బంగారం ధర పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.