13-11-2025 12:00:00 AM
కొత్త వెల్‌నెస్ ప్రోగ్రామ్ ప్రారంభం
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఏటా నవంబర్ 19న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ (ఏఐ ఎన్యూ), బంజారాహిల్స్ శాఖలో పురుషుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ పురుషుల సమగ్ర వెల్‌నెస్ ప్రోగ్రాంను ప్రారంభించింది. పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వం (సంతానరాహిత్యం), లైంగిక పటుత్వం లోపించడం లాంటి సమస్యలపై ప్రధానం గా దృష్టిసారించారు.
ప్రత్యేకంగా పురుషులు తమ ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించి చికిత్స పొందాలని, ఈ అంశాలపై ఉన్న నిశ్శబ్దాన్ని, అపోహలను అధిగమించాలని ఏఐఎన్యూ వైద్యులు ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజిలో ఆండ్రాలజిస్టు పరీక్షలతో పాటు హార్మోన్ ప్రొఫైలింగ్, ప్రోస్టేట్ స్క్రీ నింగ్, జీవనశైలి అంచనా, వీర్యపరీక్ష ఉంటా యి. ఏవైనా సమస్యలుంటే త్వరగా గుర్తించి, పునరుత్పాదక, లైంగిక ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవడం దీని లక్ష్యం. స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఆండ్రాలజిస్టు కన్సల్టేషన్, టెస్టోస్టిరాన్, మధుమేహం స్థాయి, మెటబాలిక్ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి కొన్ని రక్తపరీక్షలు చేస్తారు.
వీటన్నింటికీ లైం గిక, సంతానోత్పత్తి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభా వం ఉంటుంది. అవి.. హెచ్బీఏ1సీ, లిపిడ్ ప్రొఫైల్, టీఎస్హెచ్. వీటితో పాటు స్క్రోటల్ అల్ట్రాసౌండ్, సెమన్ ఎనాలిసిస్ పరీక్షలు కూడా చేస్తారు. ఈ సందర్భంగా ఏఐఎన్యూ బంజారాహిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడి, సిగ్గు, సమయం లేమి వంటి కారణాల వల్ల పురుషులు తమ వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తారు.
ఈ వెల్నెస్ ప్రోగ్రాం ద్వారా, ముందస్తు చికిత్సల గురించి అవగాహన పెంచి, పురుషులు తమ సమగ్ర ఆరోగ్యం, పునరుత్పాదక ఆరోగ్యంపై తగిన చర్యలు తీసుకోవాలన్నదే ఏఐఎన్యూ లక్ష్యం అని చెప్పారు. కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ సూరజ్ పిన్ని మాట్లాడుతూ.. ‘సమస్యలు ఎక్కువయ్యేవరకు పురుషుల ఆరోగ్యాన్ని తరచు నిర్లక్ష్యం చేస్తారు. ఈ వెల్నెస్ ప్యాకేజీ ద్వారా ఫెర్టిలిటీ, లైంగిక ఆరోగ్య సమస్యలను పురుషులు ఆత్మవిశ్వాసంతో, శాస్త్రీయ మార్గంలో ముందుగానే గుర్తించేలా మేం ప్రోత్సహిస్తున్నాం’ అన్నారు.