14-11-2025 08:05:35 PM
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని, శ్రావణి హాస్పిటల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ ను ఆవిష్కరించింది. శ్రావణి ఆద్యం మదర్ అండ్ చైల్డ్ సెంటర్ ను తెలంగాణ ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శిరీష రాఘవేంద్ర ప్రారంభించారు. ప్రసూతి, నవజాత శిశువుల సంరక్షణ, శస్త్రచికిత్సల వంటి సేవలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చేలా ఈ అత్యాధునిక ఆరోగ్య విభాగాన్ని ఏర్పాటు చేసారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీని, సంరక్షణతో, తల్లికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా తీసుకొచ్చిన శ్రావణి హాస్పిటల్స్ ను శిరీష రాఘవేంద్ర అభినందించారు.
మాతృత్వం అనేది మానవ జీవితంలోని అతి గొప్ప బలాలలో ఒకటిగా పరిగణించబడుతుందిన్నారు. ప్రతి స్త్రీ ప్రయాణాన్ని గౌరవించే, వారికి పూర్తి మద్దతు ఇచ్చే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని సృష్టించడం అనేది నిజంగా స్ఫూర్తినిచ్చే విషయంగా చెప్పుకొచ్చారు. ప్రసూతి సంరక్షణలో శ్రావణి ఆద్యం మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రావణి హాస్పిటల్స్ ఫౌండర్, సీఈఓ శ్రావణి చెట్టుపల్లి మాట్లాడుతూ... ఆద్యం అనేది కేవలం బిడ్డకు జన్మనివ్వడం గురించి మాత్రమే కాదు. గౌరవం, ఆప్యాయత, శాస్త్రీయ విధానాలతో జీవితపు ఆరంభాన్ని సన్మానించడమని చెప్పారు.
ప్రతి తల్లి తన ప్రసవ అనుభవాన్ని ఎంచుకునే హక్కును కలిగి ఉండాలన్నీ, ఆ అనుభవాన్ని ఆనందదాయకంగా, భద్రంగా, వారికి శక్తిని ఇచ్చే విధంగా మార్చడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, అత్యుత్తమ నిపుణులతో మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె వివరించారు. ఈ ఆరోగ్య కేంద్రంలో 4కే కార్ల్ స్టోర్జ్ అధునాతన లాపరోస్కోపీ వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ అతి తక్కువ కోతతోచేసే శస్త్రచికిత్సల కోసం, అతి స్పష్టమైన దృశ్యాలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా ఎక్కువ భద్రతతో, వేగవంతమైన శస్త్రచికిత్సలు చేయవచ్చని శ్రావణి చెట్టుపల్లి తెలిపారు.