బంగారం ధర మళ్లీ పెరిగింది
26-02-2025 12:00 AM
న్యూఢిల్లీ: వరుసగా రెండోరోజూ బంగారం ధర పెరిగింది. పసిడి ధర రూ.250 పెరగడం తో తులం ధర రూ. 89,350కి చేరుకుంది. వెండి ధరలు మాత్రం రూ.500 తగ్గి కిలోకు రూ.99,500 పలుకుతున్నది. వాణిజ్య సుంకాలపై అనిశ్చితి మధ్య.. యూఎస్ డాలర్‌తో పోలి స్తే రూపాయి మంగళవారం 51 పైసలు తగ్గి రూ.87.23 వద్ద ముగిసింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఏప్రిల్ డెలి వరీకి సంబంధించిన బంగారం కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ. 275 పెరిగి రూ.86,459కి చేరుకుంది. దేశంలోని వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రూ.80,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 88,090 పలుకుతోంది. ఇక హైదరాబాద్‌లోనూ ఇవే ధరలున్నాయి. మరో వైపు హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1.08 లక్షలు పలకుతోంది.






