15 July, 2026 | 6:22 AM

బంగారం కొనుగోలుదార్లకు ఊరట

23-04-2024 01:39 AM

దిగివచ్చిన ధర

హైదరాబాద్, ఏప్రిల్ 22: అదేపనిగా పరుగుపెట్టిన పుత్తడి సోమవారం కాస్త శాంతించింది. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరంకావన్న సంకేతాలు వెలువడటంతో  ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగా రం ఫ్యూచర్స్ ధర ఒక్కసారిగా 53 డాలర్ల మేర తగ్గి 2,360 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. దీంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సైతం 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ ధర రూ.1,200 వరకూ తగ్గి రూ. 71,600 స్థాయి కి చేరింది.

ఈ క్రమంలో హైదరాబాద్ స్టాప్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.550 క్షీణించి రూ.73,690 వద్ద నిలిచింది. గత వారాంతంలో నగరంలో ఈ ధర రూ.74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే.  22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.500 పెరుగుదలతో రూ. 67,550 వద్ద పలుకుతున్నది. పుత్తడిబాటలోనే వెండి ధర సైతం కొంతమేర తగ్గింది. కేజీ వెండి ధర రూ.1,000 మేర దిగి రూ. 89,000 వద్దకు చేరింది. వాస్తవానికి ప్రపంచ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర  2 శాతం పైగా తగ్గినప్పటికీ మన దేశంలో స్పాట్ మార్కెట్‌లో తగ్గుదల స్వల్పంగా 0.5 శాతం లోపు మాత్రమే ఉన్నది. అంతర్జాతీ యంగా ఇదే ట్రేండ్ కొనసాగితే మంగళవారం ఇక్కడ మరింత తగ్గవచ్చు.