30 June, 2026 | 2:13 AM

పసిడి ధరలు డౌన్

30-06-2026 01:42 AM
  1. మదుపర్లు భారీగా బంగారం విక్రయిస్తుండటమే కారణం
  2. హైదరాబాద్‌లో ప్రస్తుత ధర @ 1,28,860

న్యూఢిల్లీ, జూన్ ౨౯: మదుపర్లు పెద్దఎత్తున ఉన్న బంగారాన్ని విక్రయిస్తుండటం, దేశీయంగా బంగారంపై దిగుమతి సుంకాల సవరణ, అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో దేశీయంగా గోల్డ్ ధరలు పడిపోతున్నాయి. సాధారణం గా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండ్లు, డిపాజిట్లపై వచ్చే ఆదాయం పెరుగుతుంది.

బంగా రంపై ఎలాంటి స్థిర వడ్డీ లేదా ఆదాయం రాదు కాబట్టి, ఇన్వెస్టర్లు బంగారం నుంచి పె ట్టుబడులను ఉపసంహరించుకుని అధికంగా వడ్డీ వచ్చే బాండ్ల వైపు మళ్లుతున్నార నేది తాజా విక్రయాలకు అర్థం. గడిచిన ఆరునెలల్లో ఒకానొక దశలో గరిష్ఠంగా రూ. 1,92,991 పలికిన ౧౦ గ్రాముల ౨౪ క్యారెట్ల బంగారం, ప్రస్తుతం రూ.1,43,610 స్థాయికి పడిపోయింది.

అంటే.. సుమారు రూ. ౫౦,౦౦0 వరకు ధర తగ్గిందన్నమాట. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో అయి తే.. ఈ నెల ౨౨న ౧౦ గ్రాముల ౨౪ క్యారెట్ బంగారం రూ.1,31,110 పలుకగా, సోమవారం (౨౯వ తేదీ) నాటికి రూ.1,28,860కు చేరుకుంది. వారం రోజుల వ్యవధిలోనే రూ.2,250 ధరలు తగ్గడం గమనార్హం.