26 August, 2026 | 3:42 PM

మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్!

26-08-2026 02:30 PM

మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ

హైదరాబాద్: ప్రజాభవన్ లో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం జరిగింది. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో(Bhatti Vikramarka)  కొండా మురళి భేటీ అయ్యారు. తాజా పరిణామాల దృష్ట్యా ముగ్గురి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల పార్టీలోని పరిణామాలపై చర్చించారు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై అధిష్టానం సీరియస్‌గా ఉండటంతో కొండా మురళి(Konda Murali) రాయబారం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

సమావేశానికి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) హాజరుకావడంపై చర్చనీయాంశం అయింది. కొండా మురళి సమావేశం నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేయడం కీలకంగా మారింది. అటు మంత్రి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. అందుకు సంబంధించిన నివేదికను టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇద్దరి పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.