calender_icon.png 12 August, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యం

12-08-2025 12:01:24 AM

కలెక్టర్ జితేష్ వి.పాటిల్ 

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 11 (విజయ క్రాంతి): విద్యార్థుల విద్యా ప్రగతికి శారీరక, మానసిక ఆరోగ్యం కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అంతర్జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా, సోమవారం పాల్వంచ బొల్లారిగూ డెం మైనారిటీ పాఠశాలలో నిర్వహించిన జా తీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమమునకు స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

కలెక్టర్ మాట్లాడు తూ, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటేనే చదువులో పూర్తి స్థాయి దృష్టి పెట్టగలరని, అం దుకే నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రాధాన్యత వహిస్తోంద న్నారు. నులిపురుగులు శరీరంలో ఉండటం వలన పిల్లల్లో పో షకాహార లోపం, రక్తహీనత, ఆకలి తగ్గడం, అలసట, కడుపు నొప్పి, వికారం, విరోచనా లు, బరువు తగ్గటం వంటివి ఉత్పన్నమవుతాయన్నారు.ఈ సమస్యలను నివారించడా నికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంను ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.

ఆల్బెండజోల్ మాత్రలు ను లిపురుగులను పూర్తిగా నిర్మూలించడంలో, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.జిల్లా వ్యా ప్తంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 3,36,136 మంది పిల్లలు, యువతకు ఈ మాత్రలు అందించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కా వడానికి వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సమ న్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ప్రతి పాఠశాల, వసతి గృహం, అంగన్వాడీ కేంద్రం, కళాశాలలో ఈ మాత్రలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు.కొత్తగూడెం శాసనసభ్యులు కూ నంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ను లిపురుగుల నివారణ మాత్రల వలన ఎలాం టి ఆరోగ్య సమస్యలు రాకపోవడంతో పా టు, ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని ప్రజలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.

ఆగస్టు 18 వరకు నిర్వహించను న్న ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 19 ఏళ్ల లోపు ప్రతి ఒక్కరికి మాత్రలు అందించడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్ట ర్ జయలక్ష్మి, సిపిఓ సంజీవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధక సిబ్బంది,  విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.