12-08-2025 12:01:18 AM
పోలీస్ కమిషనర్ బి.అనురాధ
సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 11 : నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయని పోలీస్ కమిషనర్ బి.అనురాధ అన్నారు. సోమవారం మండల కేంద్రం కుకునూరుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్థులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులను కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ లతీఫ్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, కుకునూరుపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్, కొండపాక మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక్ష శ్రీనివాస్ రెడ్డి, వివిధ సంఘాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.