సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు శుభవార్త
11-06-2024 02:41 PM
హైదరాబాద్: సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారసుల గరిష్ఠ వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు సింగరేణి ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి 9 నుంచి అమలు చేస్తున్నట్లు సీఎండీ వెల్లడించారు. దీంతో 300 మంది నిరుద్యోగులు లబ్ది పొందనున్నారు.






